సర్కారీ కొలువులకు ఉన్న డిమాండ్ సర్కారీ చదువులకు ఉండదు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడుతూ....ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతున్నాయి. సదుపాయలుండవు, చదువు సక్రమంగా చెప్పరు అనే విమర్శలను తోసిపుచ్చుతూ... సర్కారీ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అమ్మఒడి పథకం బడి వైపు చిన్నారులు బుడి బుడి అడుగులు వేసేందుకు కారణమైతే...ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న సంస్కరణలు కొన్ని వేల మంది విద్యార్థులను ప్రైవేటు బడులకు స్వస్థి చెప్పి ప్రభుత్వ బడి వైపు నడిపిస్తున్నాయి..
0 Comments